![]() |
![]() |

బిగ్‌బాస్ 9 తెలుగు మొదలయ్యే ముందే ఆడియన్స్‌ని ట్రాక్‌లో పెట్టేందుకు పెద్ద ప్లాన్‌యే వేశారు. ఈ సీజన్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి కామన్ మ్యాన్ ఎంట్రీ అంటూ బిగ్‌బాస్ టీమ్ ప్రకటన చేసింది. ఇక వీరిని సెలక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష అంటూ అనౌన్స్ చేసింది. ఇక ఈ సెలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేయబోతుంది. వీరిని సెలక్ట్ చేసేందుకు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ అభిజిత్, నవదీప్, బింధు మాధవి రంగంలోకి దిగారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది.
ఇక ఈ అగ్నిపరీక్షకి శ్రీముఖి హోస్టింగ్ చేయబోతుంది. మీరందరూ డ్రీమ్ చేసిన స్పాట్ లైట్.. ఇదే బిగ్‌బాస్ సీజన్ 9 హౌస్‌లోకి మీ ఎంట్రీ టికెట్.. కానీ ఇక్కడ స్పాట్ లైట్ అక్కడ ఎంట్రీ టికెట్ అంత ఈజీ కాదు.. అంటూ శ్రీముఖి ప్రోమోలో బాగానే హైప్ ఎక్కించింది. వెంటనే అభిజిత్ ఎంట్రీ ఇచ్చాడు. నా మైండ్ గేమ్ గురించి మీకు తెలుసు.. కానీ ఈసారి అగ్నిపరీక్షలో మీ మైండ్ బ్లో అయిపోతుంది.. రెడీగా ఉండండి.. అంటూ చదరంగం ముందు కనిపించాడు. వెంటనే మాస్క్ అంటేనే ఫేక్.. నా ముందు ఉంది రెండే ఆప్షన్స్.. బ్లాకా లేక వైటా.. ఈ అగ్నిపరీక్షలో తేల్చేద్దాం.. అంటూ బింధు మాధవి చెప్పుకొచ్చింది. ఇక ప్రోమో చివరిలో ఏంటి సీరియస్ అవుతున్నారు.. ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదనుకుంటున్నారా.. నేనున్నాను కదా ఈ అగ్నిపరీక్షలో మీ స్ట్రెస్ ఎలా బరస్ట్ చేయాలో వాళ్లని ఎలా స్ట్రెస్ చేయాలో నేను చూసుకుంటానంటూ నవదీప్ అన్నాడు.
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ అంటూ శ్రీముఖి అనౌన్స్ చేసింది. ఇక ఈ అగ్నిపరీక్షని ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రతీరోజూ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కేవలం జియో హాట్‌స్టార్‌లోనే ఇది స్ట్రీమింగ్ అవుతుంది. అంటే మొత్తం మూడు వారాల పాటు ఈ సెలక్షన్ ప్రాసెస్‌ని చూపించబోతున్నారన్న మాట. అభిజిత్ ని చాలా సంవత్సరాల తర్వాత బిగ్ బాస్ స్టేజ్ పై చూసిన ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రోమో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
![]() |
![]() |